సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'ప్రాజక్ట్ కె'కి బల్క్ డేట్స్ ఇచ్చిన ప్రభాస్
- పవన్ సినిమాకి వెటరన్ సినిమాటోగ్రాఫర్
- బాల్యంలోకి వెళ్లే కథతో శర్వానంద్ సినిమా
* మలయాళంలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని పవన్ కల్యాణ్, రానా హీరోలుగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తాజాగా ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవి కె చంద్రన్ కెమేరా మేన్ గా జాయిన్ అయ్యారు.
* ప్రస్తుతం 'మహా సముద్రం', 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలలో నటిస్తున్న హీరో శర్వానంద్ తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పాడు. విశేషం ఏమిటంటే, ఈ చిత్రం టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందుతుందట. ఇందులో హీరో టైమ్ మెషీన్ ద్వారా తన బాల్యంలోకి వెళ్లి .. అప్పటి అనుభూతులను, అనుభవాలను, చిలిపి పనులను గమనిస్తాడట. దీనికి ఓ నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.