'ఆహా'లో నయనతార మిస్టరీ థ్రిల్లర్ .. ట్రైలర్ రిలీజ్!
- మలయాళంలో 'నిళల్'
- ప్రధాన పాత్రలో నయనతార
- తెలుగు అనువాదంగా 'నీడ'
- 23వ తేదీన 'ఆహా'లో
సెకండ్ క్లాస్ చదువుతున్న ఓ పిల్లాడు తన తోటి పిల్లలకు ఒక కథ చెబుతాడు. ఆ కథ విన్న మిగతా పిల్లలంతా భయంతో వణికిపోతారు. ఆ కథ ఏమిటి? స్కూల్ నుంచి మొదలైన ఆ కథ ఏ స్థాయివరకూ వెళుతుంది? ఆ పిల్లాడు .. అతని తల్లి జీవితాలను ఆ కథ ఎలా ప్రభావితం చేసింది? అనేదే ఈ సినిమా కథ. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నయనతార ప్రధాన పాత్ర కావడం వలన, అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ సినిమాకి ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో చూడాలి.