సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఇంగ్లిష్ టీచర్ గా మారిన కాజల్!
- రామ్ కు విలన్ గా తమిళ హీరో
- మనోజ్ సినిమాలో బాలీవుడ్ నటుడు
* లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో తమిళ నటుడు ఆర్య విలన్ గా నటించనున్నట్టు తెలుస్తోంది. కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ఈ చిత్రానికి 'ఉస్తాద్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.
* మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న 'అహం బ్రహ్మాస్మి' చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మనోజ్ సొంత సంస్థ ఎం.ఎం.ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.