'డెవిల్' కోసం భారీ సెట్లు.. కోట్ల ఖర్చు!
- భారీ బడ్జెట్ తో 'డెవిల్'
- డిఫరెంట్ లుక్ తో కల్యాణ్ రామ్
- బ్రిటీష్ కాలంలో నడిచే కథ
- భారీ సెట్లకు సన్నాహాలు
ఈ సినిమా కోసం భారీ సెట్లు వేయిస్తున్నారట.. అందుకోసం భారీ మొత్తమే ఖర్చు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. దర్శకుడిగా నవీన్ మేడారం ఇంతకుముందు 'బాబు బాగా బిజీ' సినిమా చేశాడు.. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా ఆయన భారీ బడ్జెట్ తో కూడిన ఈ సినిమాకి అభిషేక్ పిక్చర్స్ వారిని ఒప్పించాడంటే, కథలో విషయం ఉండే ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇక ఒక వైపున రాజుల చరిత్రతో 'బింబిసార' చేస్తున్న కల్యాణ్ రామ్, మరో వైపున బ్రిటీష్ వారి కాలంతో కూడిన 'డెవిల్' చేస్తుండటం విశేషం.