భారీ రేటుకు 'మేజర్' హిందీ శాటిలైట్ రైట్స్!
- ముగింపు దశలో 'మేజర్'
- దేశభక్తి నేపథ్యంలో సాగే కథ
- సయీ మంజ్రేకర్ పరిచయం
- కీలకపాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. రేవతి
'గూఢచారి' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆ మధ్య వదిలిన ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందే సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఆదరణ పొందుతూ ఉంటాయి. అందువలన ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులు 10 కోట్లకు అమ్ముడైనట్టుగా చెబుతున్నారు. కథానాయకుడితో నడిచే పాత్రల్లో సయీ మంజ్రేకర్ .. శోభిత ధూళిపాళ్ల కనిపించనున్నారు. కీలకమైన పాత్రలను ప్రకాశ్ రాజ్ .. రేవతి పోషిస్తున్నారు.