రాజకీయాల నేపథ్యంలో ధనుశ్ .. శేఖర్ కమ్ముల మూవీ?
- ధనుశ్ హీరోగా శేఖర్ కమ్ముల మూవీ
- యథార్థ సంఘటన ఆధారంగా కథ
- త్వరలోనే సెట్స్ పైకి
- తెరపైకి సాయిపల్లవి పేరు
తెలుగు .. తమిళ భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా కోసం ధనుశ్ అందుకునే పారితోషికం 30 కోట్లు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ధనుశ్ జోడీగా సాయిపల్లవిని తీసుకునే ఆలోచనలో శేఖర్ కమ్ముల ఉన్నాడని అంటున్నారు. తెలుగులో శేఖర్ కమ్ముల - సాయిపల్లవి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. అలాగే ధనుశ్ - సాయిపల్లవి జంటకి తమిళనాట మంచి ఆదరణ ఉంది. అందువలన ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.