విలన్ గా రామ్ తో తలపడనున్న సీనియర్ హీరో
- లింగుస్వామి దర్శకత్వంలో రామ్
- కథానాయికగా ఎంపికైన కృతి శెట్టి
- విలన్ పాత్రకు మాధవన్ తో సంప్రదింపులు
ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరు? అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. అందుకు సమాధానంగా ఇప్పుడు మాధవన్ పేరు వినిపిస్తోంది. ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ఇంతకుముందు 'సవ్యసాచి' సినిమాలో విలన్ గా మాధవన్ మెప్పించాడు. కూల్ గా ఆయన చేసిన విలనిజం ప్రేక్షకులకు బాగా నచ్చింది. కానీ ఆ సినిమా విజయానికి దూరంగానే ఉండిపోయింది. ఆ తరువాత 'నిశ్శబ్దం'లోను నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను చేశాడు. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన పేరు తెరపైకి వచ్చింది.