'క్రాక్' సినిమా కథ ముందు బాలకృష్ణ వద్దకే వెళ్లిందట!
- ముందుగా బాలకృష్ణ దగ్గరికెళ్లిన కథ
- కొన్ని కారణాల వలన కుదరని ప్రాజెక్టు
- నెక్స్ట్ మూవీ బాలకృష్ణతోనే
గోపీచంద్ మలినేని - రవితేజ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'డాన్ శీను' .. 'బలుపు' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో సహజంగానే 'క్రాక్' పై కూడా అంచనాలు పెరుగుతూ వచ్చాయి. కథాకథనాల్లో దమ్ము ఉండటంతో ఈ సినిమా అంచనాలను అందుకోగలిగింది .. హిట్టు తెచ్చుకోగలిగింది. బాలకృష్ణతో 'క్రాక్' చేయలేకపోయిన కారణంగానే, గోపీచంద్ మలినేని ఆ తరువాత సినిమాను ఆయనతోనే పట్టాలెక్కిస్తున్నాడట.