సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- భర్త నిర్ణయాన్ని గౌరవిస్తానంటున్న కాజల్!
- సోనూసూద్ ప్రధాన పాత్రలో క్రిష్ సినిమా
- ఇన్ స్టాలో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్
* ఇటీవలి కాలంలో పేదల పాలిట పెన్నిధిలా పేరుతెచ్చుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్ కు సినిమాలలో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆయనను తమ సినిమాలో తీసుకుంటే ప్రేక్షకులలో క్రేజ్ ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన కోసం ప్రత్యేక పాత్రలను క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు క్రిష్ తాజాగా సోనూ ప్రధాన పాత్రధారిగా ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో వీరి మధ్య ఇప్పటికే చర్చలు కూడా జరిగాయట.
* యువతరం ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. దాంతో ఆయనకు ఇన్ స్టాలో ఫాలోయింగ్ అంతకంతకు పెరిగిపోతోంది. తాజాగా 12 లక్షల ఫాలోయర్స్ ని సొంతం చేసుకుని రికార్డు సాధించాడు.