బాలకృష్ణ జోడీగా సందడి చేయనున్న శ్రుతిహాసన్?
- గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ
- కథానాయిక పరిశీలనలో శ్రుతిహాసన్ పేరు
- గోపీచంద్ మలినేనితో శ్రుతిహాసన్ కి మూడో సినిమా
అలాంటి శ్రుతిహాసన్ పేరు ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి సంబంధించి వినిపిస్తోంది. బాలకృష్ణ తన తదుపరి సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథపైన గోపీచంద్ మలినేని కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఒక పాత్రకి జోడీగా శ్రుతిహాసన్ ను అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 'బలుపు' సినిమా నుంచి శ్రుతిహాసన్ తో గోపీచంద్ మలినేనికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే ఆమె ఉంటే తన సినిమా హిట్టేననే సెంటిమెంట్ ను 'క్రాక్' బలపరిచింది. అందువలన ఆమెను తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఉన్నాడని చెప్పుకుంటున్నారు.