త్రివిక్రమ్ తో మహేశ్ మూవీ ఖరారు!
- త్రివిక్రమ్ తో మహేశ్ మూడో మూవీ
- 11 ఏళ్ల తరువాత కలిసి సెట్స్ పైకి
- నిర్మాణ సంస్థగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్
ఇక త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లోని మూడో సినిమాకి రంగం సిద్ధమైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. సంఖ్యా పరంగా మహేశ్ బాబుకు ఇది 28వ సినిమా. త్వరలోనే ఈ సినిమా షూటింగు మొదలవుతుందనీ, వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నామనే విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. 11 ఏళ్ల తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తున్నప్పటికీ, అధికారికంగా తెలియాల్సి ఉంది.