'ఐకాన్' హీరో బన్నీ కాదట!
- 'ఐకాన్' ప్రాజెక్టుపై ఆసక్తిని చూపని బన్నీ
- దిల్ రాజు అసహనం
- మరో హీరోకి ఛాన్స్
- త్వరలోనే రానున్న ప్రకటన
అయితే మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్టు పట్ల అంతగా ఆసక్తిని చూపని అల్లు అర్జున్, ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడట. ఇటీవల ఒక వేదికపై తమ తదుపరి సినిమాగా 'ఐకాన్' ఉంటుందని దిల్ రాజు స్పష్టం చేశాడు కూడా. అయినా ఆ విషయాన్ని గురించి అల్లు అర్జున్ పెద్దగా స్పందించలేదట. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టును మరో హీరోతో సెట్ చేసుకోవాలనే ఆలోచనకి దిల్ రాజు వచ్చాడని అంటున్నారు. ఈ కరోనా ఉద్ధృతి నుంచి బయటపడిన తరువాత ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నాడని చెబుతున్నారు.