దిల్ రాజు సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం?
- శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా
- పాన్ ఇండియా మూవీగా నిర్మాణం
- పవర్ ఫుల్ గా తండ్రీకొడుకుల పాత్రలు
- తండ్రి పాత్రలో చరణ్ లుక్ టెస్ట్ చేశాక నిర్ణయం
ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం విదితమే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్టుతో నిర్మించే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తుందంటూ వార్తలు కూడా వచ్చాయి.
ఇక ఇందులో తండ్రీకొడుకుల పాత్రలు వున్నాయట. ఈ రెండు పాత్రలూ పవర్ ఫుల్ పాత్రలు కావడంతో తాను ద్విపాత్రాభినయం చేస్తానంటూ చరణ్ దర్శకుడి ముందు ఓ ప్రపోజల్ పెట్టినట్టు చెబుతున్నారు. అయితే, ముందుగా తండ్రి పాత్రలో చరణ్ కి లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఏ విషయం ఫైనల్ అవుతుందని అంటున్నారు. మరి, చరణ్ ని మెగా అభిమానులు ద్విపాత్రాభినయంలో చూస్తారా? లేదా? అన్నది త్వరలో వెల్లడవుతుంది!