'వకీల్ సాబ్' కు మేం మొదట అనుకున్న టైటిల్ మరొకటి ఉంది: వేణు శ్రీరామ్
- పవన్, శృతిహాసన్ జంటగా వకీల్ సాబ్
- ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధం
- ప్రమోషన్ కార్యక్రమాలతో చిత్రయూనిట్ బిజీ
- తొలుత 'మగువా' అనే టైటిల్ అనుకున్నట్టు దర్శకుడు వెల్లడి
అయితే, పవన్ కల్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని 'వకీల్ సాబ్' అనే టైటిల్ ను ఖరారు చేశామని వివరించారు. పవన్ కల్యాణ్ అంటే వయోభేదం లేకుండా అన్ని వయసుల వారు థియేటర్లకు తరలి వస్తారని, అందుకే పవర్ స్టార్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని సినిమాలో కొన్ని అంశాలను చేర్చామని తెలిపారు.
అయితే కథ ఆత్మ దెబ్బతినకుండా పాటలకు స్థానం కల్పించామని, తమన్ చక్కని బాణీలు అందించారని కితాబిచ్చారు. బాలీవుడ్ లో హిట్టయిన పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తూ 'వకీల్ సాబ్' తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో పవన్ సరసన శృతి హాసన్ కథానాయిక కాగా, కథకు అవసరమైన ముఖ్యపాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల నటించారు.