కళ్లు చెదిరే లెవెల్లో పూజ హెగ్డే పారితోషికం!
- టాలీవుడ్ లో అగ్రకథానాయికగా పూజ హెగ్డే
- నెల్సన్ దర్శకత్వంలో విజయ్ 65వ సినిమా
- మూడున్నర కోట్లు తీసుకుంటున్న పూజ
తన కెరీర్ తొలినాళ్లలో ఈ చిన్నది 'ముగమూడి' అనే తమిళ సినిమాలో కథానాయికగా నటించింది. మళ్లీ ఇప్పుడు స్టార్ హీరో విజయ్ సరసన కథానాయికగా నటించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. విజయ్ తన 65వ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారట. ఇక ఇందులో నటించడానికి ఈ చిన్నది 3.5 కోట్లు డిమాండ్ చేసినట్టు, చేసేదేమీలేక ఆమె అడిగినంతా ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.