సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేస్తోందట!
- యాక్షన్ ఎపిసోడ్ చేస్తున్న వరుణ్ తేజ్
- మళ్లీ కెమెరా ముందుకు 'సఖి' నాయిక
* వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాక్సర్' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతోంది. ప్రస్తుతం వరుణ్ పాల్గొంటున్న ఓ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.
* 'సఖి' సినిమా ద్వారా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న నిన్నటితరం కథానాయిక షాలిని తదనంతర కాలంలో హీరో అజిత్ ని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. షాలిని త్వరలో ఓ వెబ్ సీరీస్ లో నటించనుందని వార్తలొస్తున్నాయి.