కాబోయే భర్తను పరిచయం చేసిన అవికా గోర్
- మిలింద్ చంద్వానీతో పిక్స్ ను పోస్టు చేసిన అవికా గోర్
- గోవా బీచ్ లో ప్రేమ విహారం
- తన ప్రార్థనల ఫలితమే ఇంత మంచి వ్యక్తి దొరికాడన్న అవికా
ఇటీవల వరకు బాగా బొద్దుగా కనిపించిన అవికా లేటెస్ట్ పిక్స్ చూస్తే నమ్మలేనంత స్లిమ్ గా తయారైందని ఒప్పుకుంటారు. ఇక అసలు విషయానికొస్తే... అవికా తన కాబోయే జీవిత భాగస్వామి గురించి సోషల్ మీడియాలో వెల్లడించింది. మిలింద్ చంద్వానీని పెళ్లాడబోతున్నట్టు తెలిపింది. రోడీస్ రియాల్టీషోతో గుర్తింపు తెచ్చుకున్న మిలింద్ తో తాను ప్రేమలో ఉన్నానని వివరించింది.
జీవితంలో స్ఫూర్తినిచ్చేవారు, ప్రేమను పంచేవారు కావాలని, తనకు అలాంటి వ్యక్తి మిలింద్ రూపంలో దొరికాడని అవికా పేర్కొంది. లైఫ్ లో మనల్ని జాగ్రత్తగా చూసుకునేవారు దొరకడం అసాధ్యమని భావిస్తారని, కానీ తనకు మిలింద్ రూపంలో అలాంటి వ్యక్తి దొరికాడని అవికా హర్షం వ్యక్తం చేసింది. "నా ప్రార్ధనల ఫలితం ఇతడే. ఈ మంచి వాడు నావాడు, నేనెప్పటికీ అతడి దాన్నే" అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. గోవాలో మిలింద్ తో ఆస్వాదిస్తున్న ఫొటోలను కూడా పంచుకుంది.