అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాద వార్తలపై నాగార్జున స్పందన!
- ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం
- మీడియాలో కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి
- అవి తప్పుడు వార్తలు.. బాధపడాల్సిన పనేం లేదు
- అంతా బాగానే ఉంది
కాగా, అన్నపూర్ణ స్టూడియో కూడా తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇప్పటికే దీనిపై ఓ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో అంతా బాగానే ఉందని, నిర్ధారణ చేసుకోకుండా వార్తలు వ్యాప్తి చేయొద్దని కోరుతున్నామని పేర్కొంది. నిన్న సాయంత్రం అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మాత్రం ఆగడం లేదు.