ఫోన్ లో సీఐపై రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి?... కాల్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్!
- సీఐతో ఉండవల్లి శ్రీదేవి వాగ్వాదం
- తన వారిని వదలట్లేదని ఆగ్రహం
- డీజీపీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక
'అందరినీ వదులుతున్నావు, నా కాళ్లు పట్టుకుని పోస్టింగ్ తెచ్చుకున్నావు, రెండు నిమిషాల్లో వెళ్లిపోతావు. ఎస్పీకి, డీజీపీకి చెబుతా' అంటూ హెచ్చరించారు. కాగా, అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నందుకు, వారిని వదిలి పెట్టాలంటూ శ్రీదేవి ఇలా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. శ్రీదేవి మాట్లాడినట్టుగా చెబుతున్న ఆడియోను మీరూ వినవచ్చు.