పవన్ కల్యాణ్ 28వ సినిమా గురించి బిగ్ అనౌన్స్ మెంట్!
- వరుస సినిమాలతో దూసుకుపోతున్న పవన్ కల్యాణ్
- హరీశ్ శంకర్ దర్శకత్వంలో 28వ చిత్రం
- సంగీతాన్ని అందించనున్న దేవిశ్రీ ప్రసాద్
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ తన 28వ చిత్రాన్ని చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను హరీశ్ శంకర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు. ఈ ప్రకటనతో పవన్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.