బన్నీ! నీ ట్వీట్ చూసి ఆనందంతో ఉప్పొంగిపోయా!: పూరీ జగన్నాథ్
- పూరీ పోడ్‌కాస్ట్‌లో చెబుతున్న విషయాలపై బన్నీ ప్రశంస
- చాలా అద్భుతమని వ్యాఖ్య
- గొప్ప ప్రశంస దక్కిందన్న పూరీ
- ఈ రోజు రాత్రికి ఒక ఎక్‌ట్రా పెగ్ వేస్తానని వ్యాఖ్య
వీటిని విన్న సినీ హీరో అల్లు అర్జున్ ఆయనను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. పూరీ జగన్నాథ్ పోడ్‌కాస్ట్‌లో చెబుతున్న మంచి విషయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు చాలా అద్భుతమని ఆయన పేర్కొన్నాడు. అవి తనకు చాలా బాగా నచ్చాయని చెప్పాడు. ఇటువంటి గొప్ప అంశాలను మరిన్నింటిని పూరీ వివరించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నాడు.
బన్నీ ట్వీట్‌పై పూరీ జగన్నాథ్ స్పందించారు. ఆయన ట్వీట్‌ను చదువుతూ ఆనందంతో ఉప్పొంగిపోయానని చెప్పారు. బన్నీలాంటి వ్యక్తి నుంచి ఇంత గొప్ప ప్రశంస అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పాడు. ఈ రోజు రాత్రికి ఒక ఎక్‌ట్రా పెగ్ వేస్తానని చెప్పారు.