మరోసారి రచ్చ అవుతున్న దాసరి కుటుంబ ఆస్తి వివాదం.. పోలీస్ స్టేషన్ కు చేరిన అన్నదమ్ముల పంచాయితీ!
- అరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రభు
- నాన్న వీలునామా ప్రకారమే నేను ఈ ఇంట్లో ఉంటున్నా
- అరుణ్ మమ్మల్ని తిట్టి, కొట్టాడు
ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ, నాన్న రాసిన వీలునామా ప్రకారమే తాను ఈ ఇంట్లో ఉంటున్నానని చెప్పారు. తన మనవరాలికి నాన్న ఈ ఇంటిని రాసిచ్చారని అన్నారు. ఈనెల 24 రాత్రి అరుణ్ తన ఇంటి గేటును దూకి లోపలకు ప్రవేశించాడని తెలిపారు. ఆ సమయంలో బాగా తాగేసి ఉన్నాడని... తనను, తన భార్యను, అత్తామామలను దారుణంగా తిడుతూ, కొట్టాడని చెప్పారు. అరుణ్ భార్య కూడా దుర్భాషలాడిందని తెలిపారు. పోలీసుల ముందు కూడా దాడి చేశాడని చెప్పారు.
తమ్ముడై ఉండి కూడా అరుణ్ తనపై, తన కుటుంబంపై దారుణంగా ప్రవర్తిస్తున్నాడని ప్రభు మండిపడ్డారు. ఈ విషయంలో మోహన్ బాబు, సి.కల్యాణ్, మురళీమోహన్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఎందువల్లో వీరెవరూ తమ వ్యవహారంపై మాట్లాడటం లేదని చెప్పారు. అందరూ కలిసి తనను ఒంటరి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.