గదిలో పడేసి బెల్టుతో బాదడం నాకు బాగా తెలుసు... అధికారులకు వార్నింగ్ ఇచ్చిన కేంద్రమంత్రిణి!
- చత్తీస్ గఢ్ లో ఘటన
- క్వారంటైన్ కేంద్రంలో సదుపాయాలు బాగాలేవని ఓ వ్యక్తి ఆరోపణ
- అతడిపై అధికారులు దాడి చేసినట్టు కేంద్రమంత్రికి సమాచారం
- అధికారులను నిలదీసిన కేంద్రమంత్రి రేణుకా సింగ్
దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర సహాయమంత్రి రేణుకా సింగ్ క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారు. జరిగిన ఘటనపై దిలీప్ గుప్తా, అతని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడి అధికారులపై మండిపడ్డారు. కాషాయం ధరించిన బీజేపీ కార్యకర్తలను బలహీనులుగా భావించవద్దని స్పష్టం చేశారు. గదిలో పడేసి బెల్టుతో బాదడం ఎలాగో నాకు బాగా తెలుసు అంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు. ఇకనైనా బీజేపీ కార్యకర్తల పట్ల మీరు చూపిస్తున్న వివక్షను విడనాడండి అంటూ గట్టిగా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తోంది.