కేంద్ర ప్యాకేజీ పేద ప్రజలకు ఉపయోగ పడదు: వినోద్ కుమార్
- విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు ప్రకటించడం విడ్డూరం
- విమానయాన రంగంలో సంస్కరణల వల్ల పేదలకేం ప్రయోజనం?
- ఆర్థిక సంస్కరణలకు ఇది సమయం కాదు
విమానయాన రంగంలో సంస్కరణల వల్ల దేశంలోని పేదలకు ప్రయోజనం ఎలా ఉంటుందని వినోద్ నిలదీశారు. కేంద్ర ప్యాకేజీలో దేశంలోని సామాన్యులకు ఉపయోగపడే అంశం ఒక్కటి కూడా లేదని తెలిపారు. ఆర్థిక సంస్కరణలకు ఇది సమయం కాదని ఆయన అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు జీడీపీలో 15 శాతం వరకు రాష్ట్రాలు, ప్రజలకు సాయంగా ప్రకటించాయని చెప్పారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఆర్థికంగా కుదేలయిందని ఆయన తెలిపారు.