వెబ్ సిరీస్ దిశగా వెంకటేశ్?
- జోరందుకుంటున్న వెబ్ సిరీస్ లు
- ఆసక్తిని చూపుతున్న వెంకటేశ్
- తేజతో సురేశ్ బాబు చర్చలు
ఈ నేపథ్యంలోనే చిరంజీవితో ఆయన పెద్ద కూతురు ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్టుగా కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు వెంకటేశ్ పేరు వినిపిస్తోంది. వెబ్ సిరీస్ లను ఫ్యామిలీస్ ఎక్కువగా చూస్తుండటంతో, వెంకటేశ్ తో ఒక వెబ్ సిరీస్ మొదలెడితే ఎలా ఉంటుందా అని సురేశ్ బాబు ఆలోచన చేస్తున్నారట. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ఆయన దర్శకుడు తేజతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ చర్చలు ఫలిస్తే ఓటీటీ ప్లాట్ ఫామ్ పై స్టార్స్ సందడి కొనసాగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.