విక్రమ్ కుమార్ తోనే సెట్స్ పైకి చైతూ
- విక్రమ్ కుమార్ నుంచి మరో కొత్త కథ
- నిర్మాతగా రంగంలోకి 'దిల్' రాజు
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
ఆ తరువాత సినిమాను విక్రమ్ కుమార్ తో చైతూ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు ఖాయమైపోయిందనేది తాజా సమాచారం. బీవీఎస్ రవి అందించిన కథను విక్రమ్ కుమార్ తన స్టైల్ కి తగినట్టుగా మార్చుకున్నాడట. ఈ సినిమాకి 'దిల్' రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఎవరు ఏ చిన్న సాయం చేసినా, మరిచిపోకుండా కృతజ్ఞతలు తెలియజెప్పాలి అనే ఒక బలమైన ఉద్దేశం కలిగిన కథానాయకుడి చుట్టూ తిరిగే కథ ఇది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా పనులు చేస్తున్నారు.