పవన్ కల్యాణ్ సరసన నివేదా పేతురాజ్
- భారీ సినిమాతో బిజీగా క్రిష్
- మొఘల్ చక్రవర్తుల కాలం నాటి నేపథ్యం
- కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథ
ఈ సినిమాలో కథానాయిక పాత్రకిగాను జాక్విలిన్ .. కీర్తి సురేశ్ పేర్లు వినిపించాయి. తాజాగా నివేదా పేతురాజ్ పేరు తెరపైకి వచ్చింది. కథానాయికగా ఆమె ఎంపిక ఖరారైపోయిందనే అంటున్నారు. నివేదా పేతురాజ్ మంచి పొడగరి .. అందువలన పవన్ సరసన ఆమె జోడీ బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా నివేదా పేతురాజ్ కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని అంటున్నారు.