అట్లీ కుమార్ తోనే ఎన్టీఆర్ 31వ మూవీ?
- తాజా చిత్రంగా సెట్స్ పై 'ఆర్ ఆర్ ఆర్'
- తదుపరి సినిమా త్రివిక్రమ్ తో
- లాక్ డౌన్ సమయంలో కథలు వింటున్న ఎన్టీఆర్
యువ దర్శకులు చాలా మంది ఆయనను ఒప్పించడానికి తమ కథలతో ప్రయత్నాలు చేస్తున్నారు. వైవిధ్యభరితమైన కథ అనిపిస్తే, ఆ కథనే 31వ సినిమాగా సెట్స్ పైకి తీసుకెళదామనీ, లేదంటే గతంలో అట్లీ కుమార్ వినిపించిన కథను పట్టాలెక్కించాలని ఎన్టీఆర్ ఆలోచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఎన్టీఆర్ కి కొత్త కథలేవీ నచ్చకపోతే మాత్రం, అట్లీ కుమార్ రంగంలోకి దిగిపోవడం ఖాయమన్నమాట.