'సీటీమార్'లో కావాల్సినంత కామెడీ!
- గతంలో ఫ్లాప్ అయిన 'గౌతమ్ నంద'
- మరో ప్రయత్నంగా రానున్న 'సీటీమార్'
- గోపీచంద్ సరసన నాయికగా తమన్నా
కబడ్డీ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కథా పరంగా యాక్షన్ .. ఎమోషన్ ఎక్కువగా వుంటాయనే ఎవరైనా అనుకుంటారు. కానీ ఈ సినిమాలో కామెడీ కూడా కావలసినంత ఉంటుందని చెబుతున్నారు. గోపీచంద్ - వెన్నెల కిషోర్ కి మధ్య నడిచే కామెడీ ట్రాక్ ఆద్యంతం నవ్విస్తుందని అంటున్నారు. సెకండాఫ్ కామెడీ మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. గతంలో 'గౌతమ్ నంద' సినిమాతో పరాజయాన్ని చూసిన సంపత్ నంది - గోపీచంద్ ఈ సారైనా హిట్ కొడతారేమో చూడాలి.