10 రోజులకి 5 కోట్ల పారితోషికం అందుకుంటున్న అలియాభట్!
- షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
- చరణ్ సరసన అలియా భట్
- పారితోషికంగా రోజుకు 50 లక్షలు
ఈ సినిమా కోసం అలియా భట్ 10 రోజుల కాల్షీట్స్ ను కేటాయించిందట. ఈ 10 రోజులకిగాను పారితోషికంగా ఆమె 5 కోట్లు అందుకోనున్నట్టు తెలుస్తోంది. అంటే రోజుకి 50 లక్షల రూపాయలను చార్జ్ చేస్తుందన్న మాట. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనుండటం వలన, ఆమె ఈ స్థాయి పారితోషికాన్ని డిమాండ్ చేసిందని అంటున్నారు. తెలుగు సినిమాకిగాను ఈ స్థాయి పారితోషికాన్ని అందుకున్న కథానాయిక అలియానే అని అంటున్నారు.