ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ మూవీకి భారీ బడ్జెట్
- త్రివిక్రమ్ తో ఎన్టీఆర్
- 'అరవింద సమేత' తరువాత సినిమా
- ఇతర భాషల్లోను విడుదల చేసే ఆలోచన
'ఆర్ ఆర్ ఆర్' తరువాత నాలుగైదు నెలల తేడాతో త్రివిక్రమ్ సినిమా విడుదలవుతుంది. అందువలన భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించి, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ కారణంగానే కథానాయిక కోసం బాలీవుడ్ హీరోయిన్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. జాన్వీ కపూర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 'అరవింద సమేత' సినిమా తరువాత త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.