క్రిష్ సినిమాలో పవన్ కల్యాణ్ ద్విపాత్రాభినయం?
- పవన్ తాజా చిత్రంగా 'వకీల్ సాబ్'
- క్రిష్ దర్శకత్వంలో చారిత్రక చిత్రం
- మే 2వ వారం నుంచి షూటింగ్
బందిపోటుగా మాత్రమే కాదు .. మరో విలక్షణమైన పాత్రలోను పవన్ కనిపించనున్నాడనేది తాజా సమాచారం. అంటే పవన్ ద్విపాత్రాభినయం చేయనున్నాడన్న మాట. పవన్ చేసే మరో పాత్ర ఎలా వుండబోతోంది? ఆ పాత్రను క్రిష్ ఎలా డిజైన్ చేశాడు? ఆ పాత్రలో పవన్ ఎలా కనిపించనున్నాడు? అనేవి ఆయన అభిమానుల్లో ఆసక్తిని పెంచే అంశాలనే చెప్పాలి. ఏప్రిల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావలసింది. కానీ కరోనా కారణంగా మే 2వ వారం నుంచి మొదలుకావొచ్చని అంటున్నారు.