రణబీర్ కపూర్ హీరోగా 'భీష్మ' రీమేక్?
- యూత్ ను మెప్పించిన 'భీష్మ'
- నితిన్ కెరియర్లోనే భారీ వసూళ్లు
- హిందీ రీమేక్ నిర్మాతగా కరణ్ జొహార్
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా రూపొందిన 'భీష్మ' యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆదరించడంతో, నితిన్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. దాంతో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో కరణ్ జొహార్ వున్నాడని సమాచారం. రణ్ బీర్ కపూర్ హీరోగా ఆయన ఈ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాడని చెబుతున్నారు. 'డియర్ కామ్రేడ్' రీమేక్ రైట్స్ కూడా కరణ్ జొహార్ దగ్గరే వున్న సంగతి తెలిసిందే.