వెంకీ 75వ చిత్రం దర్శకుడిగా తరుణ్ భాస్కర్
- షూటింగు దశలో 'నారప్ప'
- విభిన్నమైన గెటప్పులో వెంకటేశ్
- హార్స్ రేసింగ్ నేపథ్యంలో సాగే కథ
ఈ సినిమా తరువాత వెంకటేశ్ తన 75వ సినిమా కోసం, దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఆల్రెడీ వెంకటేశ్ కథ ఓకే చెప్పేశారని అంటున్నారు. పూర్తి స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో తరుణ్ భాస్కర్ ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాను కూడా సురేశ్ ప్రొడక్షన్స్ వారే నిర్మించనున్నట్టు తెలుస్తోంది. హార్స్ రేసింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనీ, 'నారప్ప' సినిమా షూటింగ్ పూర్తికాగానే కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.