తల్లిని చంపి ప్రియుడితో పోర్ట్‌బ్లెయిర్ కు పరార్.. ఇద్దరినీ కటకటాలవెనక్కి పంపిన పోలీసులు
- రూ.15 లక్షల బాకీ చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ
- ఆవేశం పట్టలేక చాకుతో తల్లిని పొడిచి చంపిన కుమార్తె
- బెంగళూరులోని కేఆర్‌పురంలో ఆదివారం ఘటన
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమృత కోసం గాలింపు మొదలుపెట్టారు. వారి ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిద్దరూ పరారవుతున్నట్టు గుర్తించామన్నారు. దర్యాప్తులో వారు అండమాన్, నికోబార్ దీవుల్లోని పోర్ట్బ్లెయిర్లో తలదాచుకున్నట్టు గుర్తించినట్టు చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లిన కేఆర్‌పురం ఇన్స్పెక్టర్ అంబరీశ్ బృందం అమృతతోపాటు ఆమె ప్రియుడు శ్రీధర్‌రావును అరెస్ట్ చేసింది.