ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రావడం ఖాయమైపోయింది
- గ్రామీణ నేపథ్యంలో 'ఎంత మంచివాడవురా'
- ఈ నెల 8వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- 15వ తేదీన భారీస్థాయి విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రానున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన రాకని ఖరారు చేస్తూ అధికారికంగా ఒక పోస్టర్ ను కూడా వదిలారు. ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ - జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజున రాత్రి 7 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ కథనాలు .. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.