సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఎన్టీఆర్?
- 'ఆర్ ఆర్ ఆర్'సినిమాతో బిజీగా ఎన్టీఆర్
- తదుపరి సినిమా త్రివిక్రమ్ తో
- సొంత ప్రొడక్షన్ దిశగా ఎన్టీఆర్ అడుగులు
అయితే తనకి కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ ఉండేలా చూసుకోవాలనే ఆలోచన ఆయన చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. తన తండ్రి .. తన తనయుడు పేర్లు కలిసి వచ్చేలా, 'భార్గవ్ హరి ప్రొడక్షన్స్' పేరుతో ఒక బ్యానర్ ను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం ఎన్టీఆర్ .. చరణ్ కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ సలహా మేరకే ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.