హీరోగా ఎంట్రీ ఇస్తున్న విలన్ తనయుడు
- విలన్ గా రాణించిన సత్యప్రకాశ్
- హీరోగా నటరాజ్ పరిచయం
- త్వరలో విడుదలకానున్న 'ఊల్లాల ఊల్లాల'
ఈ సినిమాను గురించి సత్యప్రకాశ్ మాట్లాడుతూ .. "మా అబ్బాయి పేరు నటరాజ్ .. 'మనసు మల్లిగా' అనే చిత్రం ద్వారా కన్నడ పరిశ్రమకి పరిచయమయ్యాడు. తెలుగు తెరకి 'ఊల్లాల ఊల్లాల' అనే సినిమా ద్వారా పరిచయం కానున్నాడు. ఈ సినిమాకి నేనే దర్శకుడిగా వ్యవహరించాను. సినిమా పిచ్చి వున్న ఓ కుర్రాడు, అందుకు అవసరమైన డబ్బుకోసం ఏం చేశాడనేదే కథ. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది" అని చెప్పుకొచ్చాడు.