ఓంకార్ దర్శకత్వంలో 'అసురన్' తెలుగు రీమేక్?
- తమిళంలో 'అసురన్' భారీ విజయం
- ధనుశ్ కెరియర్లో అత్యధిక వసూళ్లు
- తెలుగు రీమేక్ కి సన్నాహాలు
వెంకటేశ్ హీరోగా సురేశ్ ప్రొడక్షన్స్ - కలైపులి థాను సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి బయటికి వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడిని కూడా సెట్ చేశారనేది తాజా సమాచారం. 'రాజుగారి గది 3' దర్శకుడు ఓంకార్ కి 'అసురన్' తెలుగు రీమేక్ బాధ్యతలను అప్పగిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ సురేశ్ బాబుకి - ఓంకార్ కి మధ్య చర్చలు జరిగాయని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.