విడుదలకి సిద్ధమైన 'తిప్పరా మీసం'
- సెన్సారు కార్యక్రమాలు పూర్తి
- అమ్మప్రేమ ప్రధానంగా సాగే కథ
- ఈ నెల 8వ తేదీన విడుదల
తాజాగా ఈ సినిమాను గురించి శ్రీవిష్ణు మాట్లాడుతూ , "దర్శకుడు కృష్ణ విజయ్ నా పాత్రను గురించి చెప్పినప్పుడు, నాలో ఆయనకి ఈ యాంగిల్ కనిపించిందా? అని అనుకున్నాను. అవుట్ పుట్ చూశాక నాతోనే ఆయన ఈ పాత్రను ఎందుకు చేయించారనేది అర్థమైంది. ఈ సినిమాలో తల్లి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆ పాత్రను రోహిణి గారు పోషించారు. ఇలా మదర్ సెంటిమెంట్ వున్న సినిమాలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నా కెరియర్లో వైవిధ్యభరితమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.