రేపటి నుంచి రంగంలోకి దిగుతోన్న బాలకృష్ణ
- షూటింగు దశలో బాలకృష్ణ 105వ సినిమా
- నాయికలుగా సోనాల్ చౌహాన్ - వేదిక
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
ఇటీవలే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. సెకండ్ షెడ్యూల్ ను ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ప్రధాన పాత్రల కాంబినేషన్ లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన కొత్త లుక్ కి సంబంధించిన పోస్టర్ బయటికి వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగిపోయింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.