సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'వాల్మీకి'లో సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్
- ధనుశ్ తాజా చిత్రం 'తూటా'
- కైరా అద్వానికి భారీ ఆఫర్
* ధనుశ్, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో తమిళంలో రూపొందిన 'ఎనై నోక్కి పాయుమ్ తూటా' చిత్రం తెలుగు వెర్షన్ కి 'తూటా' అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ నెల 6న ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
* 'కబీర్ సింగ్' సినిమాతో ఇటీవల హిందీలో హిట్ కొట్టిన కథానాయిక కైరా అద్వానీ తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించనుంది. విజయ్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందే భారీ చిత్రంలో కథానాయిక పాత్రకు కైరా అద్వానీని ఎంపిక చేసినట్టు సమాచారం.