'సైరా' విడుదల తేదీ వాయిదాపడే అవకాశం?
- అక్టోబర్ 2న హిందీలో 'వార్' రిలీజ్
- ముంబైలో 'సైరా'కి దొరకని థియేటర్లు
- విడుదల తేదీని మార్చే ఆలోచనలో చరణ్?
అయితే అక్టోబర్ 2వ తేదీన హిందీలో 'వార్' సినిమా భారీస్థాయిలో విడుదలవుతోంది. హృతిక్ రోషన్ .. టైగర్ ష్రాఫ్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా కారణంగా అక్కడ 'సైరా'కి ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరకడం లేదట. అందువలన ఒక వారం రోజుల పాటు 'సైరా' విడుదల వాయిదా వేయడం మంచిదని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చరణ్ ను కోరినట్టుగా సమాచారం. దసరా సెలవులు కూడా కలిసొస్తాయనే ఉద్దేశంతో, అక్టోబర్ 8వ తేదీన 'సైరా'ను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి వుంది.