కోల్ కతాలో ఇండియాలో తొలి అండర్ వాటర్ మెట్రో మార్గం... వీడియో ఇదిగో!
- కోల్ కతాలో ప్రారంభోత్సవానికి సిద్ధం
- 30 మీటర్ల లోతున 520 మీటర్ల సొరంగం
- జర్మనీ నుంచి తెప్పించిన యంత్రాలతో నిర్మాణం
కాగా, ఈ రైల్వే స్టేషన్ కోల్ కతా మెట్రో లైన్-2 కిందకు వస్తుంది. సాల్ట్ లేక్ సెక్టార్ 5 స్టేషన్ ను సాల్ట్ లేక్ స్టేడియం స్టేషన్ తో కలుపుతూ 5 కిలోమీటర్ల మేరకు నిర్మించిన ట్రాక్ లో భాగంగా, 30మీటర్ల లోతులో 520 మీటర్ల పొడవైన రెండు సొరంగాలు ఉంటాయి. జర్మనీ నుంచి తెప్పించిన రచ్నా, ప్రేర్నా అనే టన్నెల్ బోరింగ్ యంత్రాలు ఈ సొరంగాన్ని నిర్మించాయి. లోపలికి నీరు లీక్ కాకుండా ఉండేందుకు నాలుగంచెల రక్షణ ఏర్పాట్లను చేశారు.