'బిగ్ బాస్' ముసుగులో బ్రోతల్ హౌస్... యాంకర్ శ్వేతారెడ్డి సంచలన ఆరోపణలు!
- తొలుత నన్ను ఎంపిక చేశారు
- ఆపై కమిట్ మెంట్ అడిగారు
- కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలి
- ప్రెస్ క్లబ్ లో శ్వేతారెడ్డి
గత ఏప్రిల్ లో తనకు ఫోన్ వచ్చిందని, బిగ్ బాస్ మూడవ సీజన్ కు ఎంపిక చేశామని చెప్పారని, ఎందుకని అడిగితే, పాప్యులర్ యాంకర్ కాబట్టి తీసుకున్నామని అన్నారని, ఆపై కార్యక్రమ సమన్వయకర్త రవికాంత్ తనకు పలుమార్లు ఫోన్ చేసి, పిలిపించి మాట్లాడారని, ఒప్పందంపై తాను సంతకాలు కూడా చేశానని శ్వేతారెడ్డి తెలిపారు. వాటి జిరాక్స్ లు తనకు ఇవ్వలేదని, ఆరోపించారు. ఆపై తమ బాస్ ను ఇంప్రెస్ చేయాలని కార్యక్రమ ప్రొడ్యూసర్ శ్యామ్ తనను అడిగారని, తానెందుకు ఇంప్రెస్ చెయ్యాలని నిలదీశానని, కమిట్మెంట్ కావాలని వారు అడిగారని, మహిళల ఆత్మగౌరవానికి ఈ కార్యక్రమం భంగం కలిగిస్తోందని శ్వేతారెడ్డి ఆరోపించారు.
తనలాగే బయటకు వచ్చి బిగ్ బాస్ పేరిట జరుగుతున్న బాగోతంపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని, కొంత మంది బాధితులు తనకు ఫోన్ చేస్తున్నారని ఆమె అన్నారు. హౌస్ లోకి కంటెస్టెంట్ గా రావాలని తనకు ఫోన్ల మీద ఫోన్లు చేసిన రఘు, రవికాంత్, శ్యామ్ ఇప్పుడు స్పందించడం లేదని అన్నారు.