పార్టీ పదవికి మరో కాంగ్రెస్ నేత రాజీనామా
- ఎన్నికల్లో ఘోర పరాభవానికి నేను ఒక కారణం
- దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నా
- పార్టీ విజయానికి కార్యకర్తలంతా కృషి చేశారు
నేడు కూడా మరో కీలక నేత, రాహుల్కు లేఖ రాయడంతో పాటు తన పదవికి రాజీనామా చేశారు. ఏఐసీసీ సెక్రెటరీ, రాజస్థాన్ కో- ఇన్చార్జీ తరుణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. కో-ఇన్చార్జిగా ఉన్న తాను ఎన్నికల్లో ఘోర పరాభవానికి ఒక కారణమని, అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. పార్టీ విజయానికి కార్యకర్తలంతా కృషి చేశారని, కానీ ఫలితం పొందలేకపోయామని, దీనికి అంతా నైతిక బాధ్యత వహించాల్సిందేనంటూ తరుణ్ లేఖలో స్పష్టం చేశారు.