యువ దర్శకుడికి ఓకే చెప్పిన కల్యాణ్ రామ్
- ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా విరించి వర్మ
- తదుపరి సినిమా కల్యాణ్ రామ్ తో
- పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ
ఇటీవలే ఈ దర్శకుడు కల్యాణ్ రామ్ కి ఒక కథ వినిపించాడట. కథలోని కొత్తదనం కారణంగా .. విరించి వర్మకి ఓకే చెప్పేశాడని సమాచారం. ప్రస్తుతం విరించి వర్మ ఈ స్క్రిప్ట్ పైనే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఇంతవరకూ చేయని పాత్రలో కల్యాణ్ రామ్ కనిపించనున్నాడని అంటున్నారు. మే నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.