విజయ్ ఇంట్రో సాంగ్ ఒక రేంజ్ లో వుంటుందట
- 'సర్కార్'తో భారీ హిట్ కొట్టిన విజయ్
- తదుపరి సినిమా అట్లీ కుమార్ తో
- దీపావళికి భారీ విడుదల
స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడట. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసేశారు. రెండవ షెడ్యూల్లో విజయ్ ఇంట్రో సాంగును అట్లీ కుమార్ వెరైటీగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. 100 మంది పిల్లలతో కలిసి ఈ ఇంట్రో సాంగ్ ఉంటుందని అంటున్నారు. డాన్స్ బాగా తెలిసిన పిల్లలను ఈ సాంగ్ కోసం తీసుకుంటున్నారని చెబుతున్నారు. త్వరలోనే ఈ సాంగ్ ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, ఈ దీపావళికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.