నన్ను కెలకవద్దు.. కెలికారో.. మీ బొక్కలన్నీ బయటపెడతా!: నటుడు శివాజీ వార్నింగ్
- విజయవాడలో జలదీక్షలో నటుడు
- మోదీ రాకతో ఏపీ అపవిత్రమయిందని వ్యాఖ్య
- సంఘీభావం తెలిపిన కారెం శివాజీ
‘నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. నన్ను కెలకవద్దు. నన్ను కెలికితే మీ బొక్కలు మొత్తం బయటపెడతా’ అని శివాజీ రాజకీయ నేతలను హెచ్చరించారు. మోదీ ప్రధాని కాదనీ, ఆయన రాజకీయ తీవ్రవాది అని విమర్శించారు. దేశంలో దుర్మార్గమైన రాజకీయాలు చేయడానికే ఆయన వచ్చారని దుయ్యబట్టారు. బీజేపీ, దాని అనుబంధ పార్టీలు ప్రజలను మోసం చేశామని అనుకుంటున్నాయనీ, ప్రజలు అమాయకులు కాదని స్పష్టం చేశారు.
మోదీ కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మోదీ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లేవరకూ తన జలదీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా, శివాజీ దీక్షకు ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ సంఘీభావం తెలిపారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు.