ఒక రోజు ముందుగానే 'దేవ్' ప్రీ రిలీజ్ ఈవెంట్
- 'దేవ్'గా రానున్న కార్తీ
- రేపే ప్రీ రిలీజ్ ఈవెంట్
- 14న సినిమా రిలీజ్
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 10వ తేదీన, హైదరాబాద్ - అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో జరపాలని నిర్ణయించుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఒక రోజు ముందుగానే ఈ వేడుకని నిర్వహించనున్నారు. వేదిక విషయంలోను .. సమయం విషయంలోను ఎలాంటి మార్పు లేదు. 9వ తేదీన ఈ వేడుకను జరపనున్నట్టుగా తాజాగా తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన ఈ సినిమా తప్పకుండా తనకి హిట్ తెచ్చిపెడుతుందని కార్తీ భావిస్తున్నాడు.